Friday, March 11, 2011

మహాశయులారా... మన్నించండి..!!

బళ్లారి రాఘవ

తెలుగు నాటకరంగ కీర్తిని విశ్వవ్యాప్తం చేశావని విర్రవీగుతున్నావా..?
డాల్బీ, డిజిటల్ తెరలపై కదలాడే నేటీ హీరోల ముందు నీవెంత..?
అయినా.. నాటకాలాడుకునే నీకు నిలువెత్తు విగ్రహమెందుకు రాఘవా..
అందుకే నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!



పలనాటి బ్రహ్మనాయుడు

నీ పౌరుషం పలనాటి గడ్డపై చూపించుకో..
నీ చాపకూటి సహపంక్తి భోజనాల ఆదర్శం ఎవరిక్కావాలి..?
నీ పలనాడు వెలకట్టలేని మాగాణా..? 
అందుకే.. నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!





ఎర్రాప్రగడ

అశేష ఆగమ శాస్త్రాల్లో పట్టు సాధించావ్..
రామాయణ, భారతాల్లో పాండిత్యాన్ని ప్రదర్శించావ్.
కవిత్రయంలో ఒకడిగా గుర్తింపు పొందావ్..
కానీ.. మా ఆగ్రహాన్ని గుర్తించలేకపోయావ్...
అందుకే.. నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!


గురజాడ అప్పారావు

దేశమును ప్రేమించుమన్నా.. మంచియన్నది పెంచుమన్నా..?
చెట్టపట్టాల్ పట్టుకుని దేశస్థులంతా నడవవలెనోయ్!
అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్!
విడిపోతామంటే.. కలిసుండమంటావేంటి గురజాడా..?
అందుకే.. నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!




క్షేత్రయ్య

గుళ్లు, గోపురాలు తిరిగి క్షేత్రుడనిపించుకున్నావు
మొవ్వగోపాలుడొక్కడే పురుషుడన్నావు
మరి మేమెవరిమి క్షేత్రయ్యా..?
అయినా.. రాగాలు తీసుకునే నీకు రాతి విగ్రహమెందుకు..?
అందుకే.. నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!


ముట్నూరి కృష్ణారావు

జాతీయోధ్యమానికి కృష్ణా పత్రిక పెట్టావ్
సంక్షుభిత సమాజానికి కొత్త వెలుగులిచ్చావ్
పోరాటాలతో ఎందరికో ఆలంబనగా నిలిచావ్
మరి ఇప్పటి ఉద్యమంలో ఎందుకు లేవు కృష్ణారావ్?
అందుకే నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!



నన్నయ

నువ్వు ఆదికవి కానీ ఆధునిక కవివి కాదుగా..?
మా ఉద్యమాన్ని సిరాతో చెక్కడానికి..!
అయినా.. రాజమహేంద్రిని వదిలి..
భాగ్యనగరికి వచ్చావేంటి నన్నయా..?
అందుకే నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!


రఘుపతి వెంకటరత్నం నాయుడు

బ్రహ్మసమాజాన్ని తెలుగునాటకి తెచ్చావ్..
సంఘసంస్కరణోద్యమాన్ని నడిపించావ్..
సమాజంలోని చెడును దునుమాడావ్..
మరి మా ప్రత్యేకవాదాన్ని ఎప్పుడు గుర్తిస్తావ్..?
అందుకే నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!



సర్ ఆర్థర్ కాటన్

గోదావరి జలాలకు అడ్డుకట్టవేశావు..
ధవళేశ్వరం ఆనకట్టకు ఆద్యుడవయ్యావు..
ఆంధ్రను అన్నపూర్ణగా తీర్చిదిద్దావు..
మరి తెలంగాణను ఎందుకు మరిచావు..?
అందుకే నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!


సర్ సి.ఆర్.రెడ్డి

నీ రసికత-సరసతలతో చలాన్నే మెప్పించావని విర్రవీగుతున్నావా!
సాహిత్యాన్నే సంసారంగా మార్చుకున్న బ్రహ్మచారివి.
ఆంధ్ర-తెలంగాణల కాపురంలో కష్టాలు నీకేం తెలుసు?
అందుకే నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!




శ్రీ శ్రీ

ఎముకలు కుళ్లిన వయసు మళ్లిన సమాజం కాదు మాది
సీమాంధ్రులపై తెలంగాణ వాదులు చేస్తున్న మరో ప్రస్థానమిది
ప్రపంచం బాధనంతటినీ నీలో పలికిస్తావనిపించుకున్నావ్..!
మరి మా ఆగ్రహావేశాలను పట్టించుకునేందుకు ఎందుకు లేవు?
అందుకే నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!



శ్రీకృష్ణదేవరాయలు

నీ పాలనలో స్వర్ణయుగం చూపించావు
రాజ్యంలో సర్వతోముఖాభివృద్ధి సాధించావు
అష్టదిగ్గజాలతో ఆరాధ్యుడవయ్యావు..
అన్నిటినీ మించి.. తెలుగు భాషను ప్రేమించావు
అందుకే.. నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!



త్రిపురనేని రామస్వామి చౌదరి

అగ్రకులాధిక్యంపై విల్లు ఎక్కుపెట్టి..
అస్పృశ్యత నివారణకు కృషి చేస్తే సరిపోతుందా?
స్వాతంత్ర్య సంగ్రామంలో వీరగంధం పూసి ఊరుకుంటావా..?
తెలంగాణ మహోధ్యమాన్ని పట్టించుకోవా..?
అందుకే నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!



ట్యాంక్'బండ్'పై నేలకూలిన మహానుభావులకు ఇదే నా నివాళి

(గమనిక: ఇందులో పద్యరీతులను, ఛందస్సును వెతక్కండి. ఏవైనా తప్పులుంటే భాషా పండితులు క్షమించండి.


ఫోటోలు: ఈనాడు సౌజన్యంతో..)

9 comments:

Indian Minerva said...

వీళ్ళలో కొంతమంది పేర్లుకూడా నేను వినలేదండీ ఇప్పుడు మీరు చెబుతుంటే తెలిసింది Thank you. కానీ తప్పతాగి పిచ్చివేషాలెయ్యడానికి, నాశనంచేయడానికి విజ్ఞానం సరికదా అసలు జ్ఞానమే అఖ్ఖరలేదు.

Anonymous said...

దీని అంతటికీ కారణం తెలెమ్గాన సాహితీవేత్త అని చెప్పుకునే..జూలూరి గౌరీ శంకర్ . అంతకు మునుపే శ్రీ శ్రీ విగ్రహాన్ని కూలగొట్టాలని చెప్పాడు గా.

newsforu said...

ఎందుకు మన్నించాలి.... ఇంత నీచానికి పాల్పడిన వారిని... ఇంత దుర్మార్గంగా తయారైన ప్రపంచాన్ని ఎందుకు క్షమించాలి....
అయినా క్షమించదగ్గ నేరం మనం చేయలేదు....
మాది తప్పుకాదని మనసు చంపుకుని చెప్పొచ్చు...
మా కష్టాలకన్నా ఇదేమీ ఎక్కువ కాదని వాదించొచ్చు...
తెలంగాణ వారి విగ్రహాలు కాదని సర్థిచెప్పుకోవచ్చు...
సాంస్కృతిక వైభవాన్ని తెలుగు,తెలంగాణగా విడదీయొచ్చు...

కానీ తాము మనుషుల్లా ప్రవర్తించలేదని మాత్రం అంగీకరించి తీరాల్సిందే.
తాము చేసింది క్షమించరాని, మన్నించలేని... అసలు క్షమించమని అడిగే అవకాశం లేని తప్పని మాత్రం అంగీకరించాల్సిందే....
అయినా ఆ మహాత్ములను నేను మన్నించమని అడగను...
ఎందుకంటే అలా అడిగే అర్హత నాకు లేదు...మనకి లేదు...

Anonymous said...

భారతదేశం పరదేశి శృంఖాలలో ముగ్గుతున్నప్పుడు ఎందఱో మహానుభావులు అందరిని ఒక్క త్రాటి కిందకు ఎంతో
వయప్రయసలతో చేర్చారు.
అలాంటి ఫలాని ఈనాడు మనం చేజుతులా పారవేసుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళుతున్నమో తెలీని ఉన్మాదస్థితిలో వున్నాం.
ఇది నిజంగా ప్రతి తెలుగువాడు తలదించు కొనే పరిస్తితి

panyala jagannath das said...

మూర్ఖత్వానికి పరాకాష్టగా నిలిచిన సంఘటనను చక్కగా చూపారు.

Unknown said...

nice. i have the same view.. u resembeled that. thank u

పద్యాల విక్రమ్ కుమార్ P Vikram Kumaar said...

శిఖరసమానులైన తెలుగు వెలుగుమూర్తులను అవమాని౦చడ౦ జాతీయ గీతాన్ని, పతాకాన్ని అవమాని౦చడమ౦తటి పాతక౦ కన్నా తక్కువే౦కాదు.

Anonymous said...

చాలా బాగా రాశారండి.

Nagabhushanam G said...

udyamam perutho... chestunna dashteekamika chalu. Telugu jathike mayani macha techina durghatana idi. Oo swarthaparulara inka aapandi chalu mee nirvakalu. Motham jathine avamanapaljesaru. Sankuchitatvam nunchi bayatiki randi. Dikkumalina, neethi malina oka tagubothu vachi.. sentiment antoo rechagodithe... Edo vachestundani Kallu tagina kotullaga vyavaharistunnaru. Alochinchadi okasari.. Atma parishalani chesukondi.. Meeru chestunna Dhwamsarachana charitralo siggutho talavanchukunela chestondi.