Monday, July 11, 2011

నేడో రేపో తెలంగాణ..!!

     తెలంగాణపై ప్రకటన చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభాన్ని వీలయినంత త్వరగా చక్కదిద్దాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందులోభాగంగానే వారం, పది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కీలక ప్రకటన చేసేందుకు ఆ పార్టీ సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే మూడు ప్రత్యామ్నాయాలను కూడా హైకమాండ్ రెడీ చేసినట్లు సమాచారం..

ఆప్షన్ 1: నిర్దిష్ట కాలపరిమితితో తెలంగాణను ప్రకటించడం

ఆప్షన్ 2: నిర్దిష్ట కాలపరిమితితో తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేస్తూ.. హైదరాబాద్ పై విస్తృతంగా చర్చించడం

ఆప్షన్ 3: రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయడం

ప్రస్తుతం ఈ మూడు ప్రత్యామ్నాయాలను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తయారుచేసినట్లు విశ్వసనీయ సమాచారం. వీటిపై ఇటు తెలంగాణవాదులు, అటు సమైక్యవాదుల అభిప్రాయాలను సేకరించి.. ఏదో ఒకదానిపై ఏకాభిప్రాయం సాధించి దాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.. 

ఈ ఆప్షన్స్ తో సమస్య సద్దుమణిగేనా..?
     ఈ మూడు ఆప్షన్స్ ను ఓ సారి పరిశీలిస్తే కొంతమేర సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చని అర్థమవుతుంది..

ఆప్షన్ 1: నిర్దిష్ట కాలపరిమితితో తెలంగాణను ప్రకటించడం..:
     ఈ ఆప్షన్ అమలు చేసేందుకు సమైక్యవాదుల నుంచి వ్యతిరేకత రావడం సహజం.. ప్రస్తుతం యధాతథంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేందుకు సమైక్యవాదులు అంగీకరించకపోవచ్చు.. కొంతకాలం ఇలాగే కొనసాగించినా.. ఆ తర్వాత తెలంగాణ విడిపోవడానికి వారి నుంచి సానుకూలత వస్తుందని ఆశించలేం..

ఆప్షన్ 2:  నిర్దిష్ట కాలపరిమితితో తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేస్తూ.. హైదరాబాద్ పై విస్తృతంగా చర్చించడం
     ఇది కొంతమేర ఏకాభిప్రాయ సాధనకు వీలయిన ఆప్షన్ గా కనిపిస్తోంది.. నిర్దిష్ట కాలపరిమితితో తెలంగాణ ఏర్పాటును ప్రకటిస్తే.. తెలంగాణ వాదుల నుంచి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు.. అయితే.. హైదరాబాద్ లేని తెలంగాణను అంగీకరించేందుకు తెలంగాణవాదులు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించరు. అదే సమయంలో హైదరాబాద్ పైనే ప్రస్తుతం సమైక్యవాదుల నుంచి పేచీ ఎదురవుతోందన్న విషయం తెలిసిందే..! అందుకే.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రకటిస్తూ.. హైదరాబాద్ పై విస్తృతంగా చర్చించేందుకు సిద్ధమవడం ఇరుప్రాంతాలవారికీ కొంత సానుకూల పరిణామంగానే భావించవచ్చు.. విస్తృత చర్చల తర్వాత హైదరాబాద్ పై తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా ఇరుప్రాంతవాసులూ కట్టుబడి ఉంటే ఆ తర్వాత సమస్య ఉండకపోవచ్చు..

ఆప్షన్ 3: రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయడం..
     రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయడం అంటే.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును చెత్తకుప్పలో వేయడమే.. ఈ ఆప్షన్ కు సమైక్యవాదులు అంగీకరించినా.. తెలంగాణవాదులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. కాబట్టి ఆప్షన్ కు అవకాశమే లేదని అర్థమవుతుంది..

కనీసం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ స్పందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నిర్ణయమేదైనా.. త్వరగా తీసుకుంటే ఇరుప్రాంతాలకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది.. ఈ ఆప్షన్స్ పైనైనా ఇరుప్రాంత నాయకులూ ఏకాభిప్రాయానికి రావాలని ఆశిద్దాం...

3 comments:

Anonymous said...

ఈ మూడు ప్రతిపాదనలు కొత్తవేం కాదు. తెలంగాణ ఏర్పాటు అంటే.. ఒక్కరోజులో ముగిసే తంతుకాదన్నది అందరికీ తెలిసిందే.అందుకే తెలంగాణ ఏర్పాటుకు సై అంటే చర్చలకు సిద్ధమని..తెలంగాణవాదులంతా ఎప్పుడోచెప్పారు. చర్చల ప్రక్రియ వెంటనే ప్రారంభించాలన్న‌ది తెలంగాణవాదుల డిమాండ్‌. సమైక్యవాదులంతా రెండో ఆప్షన్‌ బెస్ట్ అని భావిస్తారు.
ఇకనైనా సమైక్యవాదులు.. తెలంగాణ ఏర్పాటుకు ఓకే చెప్పి.. చర్చలకు ముందుకొస్తే మంచిది. హుందాగా గొడవ పరిష్కరించుకొని.. అన్నదమ్ముల్లా విడిపోతే మంచిది. ఆంధ్రా ప్రజలు, మేధావులెవరూ దీనికి వ్యతిరేకం కాదని తేల్చిచెప్పారు. ఇక రాజకీయనాయకులు( కొందరు మాత్రమే) పంతాలకు పోకుండా.. విషయం తేలిస్తే.. ఇరు ప్రాంతాల ప్రజలు తమ జీవితాలను సాఫీగా పునఃప్రారంభం చేసుకొని భవిష్యత్‌ వైపు వెళ్లగలుగుతారు.
కె. అజయ్‌ కుమార్‌ పద్మశాలి. t-news.

nalo nenu said...

కొండను తవ్వి ఎలకను పట్టినంట్టుంది..కాంగ్రెస్‌ అధిష్టానం తీరు. ఏడాది క్రితం తెలంగాణ ప్రకటన వచ్చిన మరుక్షణమే. హైదరాబాద్‌పై సీమాంధ్ర నేతల అభ్యంతరాలను నివృత్తిచేసేందుకు చర్చల ప్రక్రియ మొదలుపెట్టాలని తెలంగాణవాదులంతా కోరారు. ఢిల్లీకి వెళ్లిన కాంగ్రెస్‌ నేతలంతా .. చర్చల ప్రక్రియ ప్రారంభించాలనే డిమాండ్‌ చేశారు. అనవసరంగా కాలయాపన చేసి.. తెలంగాణ, సీమాంధ్రుల మధ్య విద్వేషాలు మరింత పెరిగేలా చేసింది కేంద్రం. మొత్తానికి ఇప్పటికైనా ఈ విధానంపై స్పష్టత లేదనిపిస్తున్నది. మొదటి, మూడో ఆప్షన్లకు తెలంగాణ ప్రజలు ఎలాగూ ఒప్పుకోరు. ఇక రెండో ఆప్షన్‌ సీమాంధ్రులకు కూడా ఆమోదయోగ్యమైనది.
ఇంత క్లారిటీ ఉన్నప్పుడు ఇదే ఆప్షన్ ప్రకటించవచ్చుకదా. హుందాగా విభజన జరిగి.. ప్రజలు విద్వేషాలు లేకుండా ఎవరి బతుకువాళ్లు బతికే అవకాశాన్ని ఎందుకు పరిశీలించరు.
కె. అజేయ్‌

Satya Narayana said...

Telangana people maybe politicians, arguing that we want Telangana because Telangana was not developed. And i'm asking such people, if you want a seperate state to improve, then why do you need an already improved region i.e, Hyderabad. In India so many states are seperated based on language differences only, of course you can say that Hindi people have so many states then don't Telugu people, yup you're right but Hindi is not a regional language like Telugu, it's National language. Can you imagine a state with 500million people (50 crore people) and that too from Kasi to Kanya Kumari. And one more thing హైదరాబాదు పై మాది పేచి కాదు హేతుబద్దమైన వాదన. In the Indian history so many states are seperated but none them have the capital city... Ex. Gujarat was seperated from Maharastra but still the Mumbai is under Maharastra only, and our Andhra Pradesh is seperated from Tamilanadu and Chennai is in Tamilanadu like that any state. And not only in Telangana districts even some of the districts in Rayalaseema and in Kostha like Srikakulam, Vijayanagaram was not improved. And some of the Telangana people is saying that their resources are robbed by Kostha people, remember the people who rob resources will not affected by the regional feelings they just want money thats all, Ex. Gali J. Reddy, robbed the iron ore in Rayalaseema only... You people are saying that in Telangana no leaders have the power I know only former Chief Minister Chenna Reddy from Telangana because i'm not from Telangana, you're 40% in Andhra Pradesh. But 60% of people in A.P. are from Backward Caste B.C. but we don't have even one C.M. in the entire history of our state, does we? Even if the state is seperated Telangana C.M. would be from Congress or T.D.P. or T.R.S. i.e, K.K, or Jana Reddy or Nagam J. Reddy, Yerra belli dayakararao, or K.C.R. all these people are from upper castes only... Is it a Marxist rule..? If our B.C. people kicked you out then you can't live in our India.