Wednesday, June 01, 2011

మొబైల్ తో బ్రెయిన్ క్యాన్సర్..!!

     రోటీ, కపడా, మకాన్.. ఔర్‌ మొబైల్‌..! అవును మీరు విన్నది నిజమే.. ఇప్పుడు మొబైల్‌ ఫోన్ కూడా ప్రజల ప్రాథమిక అవసరంగా మారిపోయింది. అది జేబులో లేకుండా బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.. అయితే... రోటీ కపడా ఔర్‌ మకాన్‌ మనల్ని బతికిస్తుంటే... కొత్తగా వచ్చి చేరిన మొబైల్‌ మాత్రం మనల్ని నిలువునా చంపేస్తోంది...

     రోజూ గంటలకొద్దీ ఫోన్లు మాట్లాడేవారికి ఇది బ్యాడ్‌ న్యూస్‌..! మొబైల్‌ ఫోన్లలో గంటలకొద్దీ మాట్లాడుతుంటే.. మీకు త్వరలోనే బ్రెయిన్‌ క్యాన్సర్‌ రావొచ్చు..!! అవును ఇది నిజం. ఏదో అల్లాటప్పా సర్వే కాదిది.. సాక్షాత్తూ వరల్డ్‌ హెల్త్ ఆర్గనైజేషన్‌ చెబుతున్న అక్షర సత్యం.. 31 మంది శాస్త్రవేత్తలు 14 దేశాల్లో విస్తృతంగా పరిశోధనలు చేశారు. రోజూ 30 నిమిషాలపాటు ఫోన్లు మాట్లాడేవారిని ఈ సర్వేకి ప్రాతిపదికగా తీసుకుని.. పదేళ్లపాటు పరిశీలించారు.. మొబైల్‌ఫోన్లకు, బ్రెయిన్‌ క్యాన్సర్‌కున్న సంబంధంపై శాస్త్రీయంగా జరిగిన మొట్టమొదటి సర్వే ఇదే..!


     పదేళ్లపాటు రోజూ 30 నిమిషాలు ఫోన్లో మాట్లాడినవారికి బ్రెయిన్ క్యాన్సర్‌ వస్తున్నట్లు సర్వేలో తేలింది.. మరి జీవితకాలంపాటు ఫోన్ మాట్లాడే వారి పరిస్థితేంటి..? ప్రపంచవ్యాప్తంగా సుమారు 5వందల కోట్ల ఫోన్లు వాడుకలో ఉన్నాయి.. ఫోన్లతోపాటు.. ఫోన్లు వాడుతున్నవారి సంఖ్య కూడా ఏటికేడాది గణనీయంగా పెరిగిపోతోంది.

     కాన్సర్‌ను కలిగించే కారకాలలో ఇప్పటివరకూ సిగరెట్లు, సన్‌బెడ్లు, ఆస్‌బెస్టాస్‌లు ఉన్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు మొబైల్‌ ఫోన్‌ కూడా చేరింది. చెవుల దగ్గర తిష్టవేసిన మొబైల్‌ ఫోన్లను వెంటనే తొలగించకపోతే.. గ్లియోమా అనే బ్రెయిన్‌ క్యాన్సర్‌ రావచ్చని WHO తెలిపింది.

     ఫోన్లు వాడుతున్నవారందరికీ క్యాన్సర్‌ వస్తుందని భావించాల్సిన అవసరం లేదని WHO వివరించింది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మొబైల్‌ ప్రభావం నుంచి బయటపడవచ్చని సూచించింది. వాయిస్‌ కాల్స్‌ను నివారించి.. మెసేజ్‌ చేయడం ద్వారా.. హెడ్‌ఫోన్స్‌‌ను వాడడంద్వారా క్యాన్సర్‌ బారిన పడకుండా కాపాడుకోవచ్చని వెల్లడించింది.

     మొబైల్‌ ఫోన్లతో ముప్పును పసిగట్టిన ఫ్రాన్స్ ప్రభుత్వం ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. సెల్‌ఫోన్ల వల్ల కలిగే నష్టాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది.

2 comments:

arun said...

Hi Anna nuvvu cheppindhi 100% corrct.. even ni8 times lo mobile pakkana pettukoni padukunna a raditions ki headache lantivi vastayi nizamga cheppalante nenu edivaraku daily mobile 3to 4 hrs use chese vanni ears lo pain vastunde now total ga matladatam tagginchesaa now im fine... bt now chat chestunna danivalla emaina probs unte malli oka blog create chey... ny how its a gud article..

an indian said...

రాజన్నా స్టోరీ చాలా బాగుంది. కానీ ఈ స్టోరీకి పూర్తి వ్యతిరేకమైన స్టోరీని జీ24లో ప్లే చేశారు. మెసేజ్‌ల వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందని.. ప్రాణాంతక మెసేజ్‌లంటూ.. అరగంట స్టోరీ ప్లే చేశారు. డబ్ల్యూహెచ్‌ఓ కన్నా ఎక్కువ రీసెర్చ్ మనోళ్ళే చేసినట్లున్నారు. రేడియేషన్ తీవ్రతను తగ్గించుకోవటానికి.. మెసేజ్ చేయాలి.. ఇయర్ ఫోన్స్ వాడాలనేది డబ్ల్యూహెచ్‌ఓ సూచన.

ఈ సంగతి పక్కన పెడితే... టైమ్స్ మ్యాగజైన్ స్టోరీ ప్రకారం 21మే యుగాంతం కావాలి. దీన్ని టీవీ9, జీ24 చానళ్ళు అతిగా చేసి చూపించాయి. అరగంట స్టోరీలు వేసి.. దుమ్ముదులిపాయి. 2012 డిసెంబర్ 22 కాదు... రెండ్రోజుల్లో యుగాంతం వస్తుందంటూ... ఊదరగొట్టాయి. జీ 24 చానల్ ఎండ్ వాయిస్ ఇంకా హాస్యాస్పదం.. మే 21 యుగాంతం నిజమాకాదా తెలియాలంటే.. మే 22 ఉదయం వరకు వేచిచూడాల్సిందేనట... వాట్ ఎ జోక్ ఇటీజ్... జనాలు ఆసక్తిగా చూసే ఎన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీలు చేసిన జీ24 నుంచి ఇలాంటి చెత్త స్టోరీ అస్సలు ఎక్స్‌‍పెక్ట్ చేయలేదు. రాంగోపాల్ వర్మ సినిమాలా.. నా ఇష్టమున్న సినిమాలు తీస్తానంటే ఎలా.. జనాలకు ఎంతవరకు అవసరమో కనీసం ఆలోచించరా..

అద్భుతమైన క్రియేటివ్ టీమ్ ఉన్న జీ24 ఎన్నో అద్భుతమైన స్టోరీలు ఇచ్చింది. కానీ టైమ్ మ్యాగజైన్ స్టోరీ.. అంతకుముందు మరికొన్ని స్టోరీలు చానల్ చూడగానే స్కిప్ చేయాలనిపించాయి. నేను ఇంటికెళ్తే బ్రేకింగ్ న్యూస్, స్పెషల్ స్టోరీల కోసం జీ24 చూస్తాను. బ్రేకింగ్ విషయంలో సూపర్బ్ కానీ.. స్టోరీల విషయంలో అదీ ఈమధ్యే కాస్త బోర్ తెప్పించేవి, ఆసక్తి కలిగించని స్టోరీస్ ప్రిపేర్ చేస్తున్నారు. వాతలు పెట్టుకున్న నక్క(tv9)ను చూసి మరో నక్క(జీ24) కూడా వాతలు పెట్టుకుంటే ఎలా రాజన్నా...

ఓకే అన్నా ఇదంతా నా ఆవేదనే.. ఎందుకంటే నేను మీ చానల్ నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను.. నేనే కాదు.. బయట చాలామంది జీ బ్రేకింగ్స్... స్టోరీస్‌పై ఇంట్రెస్ట్ చూపుతారు.

చలో ఉంటా అన్నా తప్పులుంటే క్షమించాలి..

సర్వేజనా సుఖినో భవంతు

జైహింద్