Thursday, February 17, 2011

ఎమ్మెల్యేలూ...శెభాష్..!!?

ఎస్.. నిజంగా మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నాం..
ప్రజాస్వామ్యం ఎంత ఉంది అంటే.. మాటల్లో వర్ణించలేనంత..!!
చేతలతో మాత్రమే కొట్టుకునేంత..!!!

ప్రజాస్వామ్యం మనదేశంలో ఇంకా బలంగా ఉందని చెప్పడానికి మన ఎమ్మెల్యేలే సాక్షి..! శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో వారు వ్యవహరించిన తీరు.. ప్రజాస్వామ్యానికి నిదర్శనం..
సభలో కూడా తనకు ఇష్టమొచ్చినట్లు వ్యవహరించే అవకాశం ఎమ్మెల్యేలకు ఉండడం ప్రజాస్వామ్యం కాదా..?
రాజ్యాంగంతో సంబంధం లేకుండా.. చట్టాలతో పనిలేకుండా.. స్వేచ్ఛగా నినాదాలు చేయడం.. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం.. ఆయనపై పేపర్లు విసిరేయడం.. మైకులు విరగ్గొట్టడం.. ఆయన కుర్చీని లాగిపారేయడం... గుడ్..!!
నిజమైన ప్రజాస్వామ్యం అనిపించారు మన ఎమ్మెల్యేలు..

ప్రజల ఆకాంక్షలకు మన ఎమ్మెల్యేలు పట్టం కడుతున్నారు..! 
నియోజకవర్గాల్లోని సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించండి చాలు అంటే... ఏకంగా కాల్చివస్తున్నారు..!
తాము ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే నుంచి ప్రజలు ఇంతకంటే ఏం కోరుకుంటారు చెప్పండి..?

ప్రజాస్వామ్యానికి తామే ప్రతినిధులమని చాటారు ఇవాళ మన ఎమ్మెల్యేలు..!
నిరసనలు శాంతియుతంగానే ఉండాలని ఎవరు చెప్పారు..? మనది ప్రజాస్వామ్య దేశం..! ఎలాగైనా నిరసనలు చేసుకోవచ్చు.. ఎలాగైనా ఆందోళనకు దిగొచ్చు.. సాటి ఎమ్మెల్యేలను నోటికొచ్చినట్లు దుమ్మెత్తిపోయొచ్చు..!! తమకు నచ్చకపోతే చేయి చేసుకోవచ్చు..!! ఎస్.. ఇదే నిజమైన ప్రజాస్వామ్యం..

స్వేచ్చగా మాట్లాడుకోవడం.. ప్రజాస్వామ్యం..!
ఇష్టమొచ్చినట్లు తిట్టడం.. ప్రజాస్వామ్యం..!!
కానివాణ్ని కొట్టడం.. ప్రజాస్వామ్యం..!!!
ప్రజలెన్నుకున్న తర్వాత.. ఏమైనా చేసే అధికారమే... ప్రజాస్వామ్యం..!!!!

(తిట్టేందుకు మాటలు చాలక.. పొగిడాను.. క్షమించండి..)

5 comments:

RITHESH DUBAI said...

Thandri Kodukulu (Y.S & JAGAN) kalisi rashtranni dochuku thintunte anni telisi musukoni kurchunna JP ki. Opposition leader aina BABU ni (Nee thalli Kadupulo enduku puttana ani bada padettu chesta) assembly shakshi gaa thitti napudu musukoni kurchunna JP ki.
Eppudu TRS & BJP Governor speech ni addukonte gurthuku vachaya PRAJASVAMYA viluvalu.

చదువరి said...

ప్రజాస్వామ్యం గురించి మాట్టాడితే మనోభావాలను గాయపరచినట్టా? తెరాస నాయకుల తప్పు ఎత్తి చూపితే తెలంగాణ ప్రజలందరినీ అవమానించినట్టా? జేపీని కొట్టిన తప్పు చేసిన వాడు ఒక్కడే. మరి తెలంగాణ ప్రజలంతా తప్పు చేసినట్టేనా?

ప్రజాస్వామ్యం గురించి మాట్టాడితే కించపరచడమా? ’కొట్టుండిరా ఆణ్ణి’ అని అనడం మాత్రం ఒప్పా? అలా అయితే.., ’ఆంద్రోళ్ళు అది’, ’ఆంద్రోళ్ళు ఇదీ’ అంటూ తెల్లారి లేచిన దగ్గర్నుండి, పడుకునేదాకా తిట్టిపోసే వాళ్ళందరిదీ ఏంటి? నోటి దూలా? ఒళ్ళు బలుపా? తల పొగరా? తిన్నది అరక్కపోడమా?

’నేను ఏడుపుగొట్టు పిల్లకాయను, అలిగి ఉన్నాను, కాబట్టి నేను ఏం చేసినా మీరు భరించాలి. మీరు మాత్రం నోరుమూసుకుని పడి ఉండాలి.’ ఇదీ కొందరు ఏడుపుగొట్టు సన్నాసి తెవాద నాయకుల తీరు.

ఇక ఈ బాపతు రౌడీల నుండి మనకు విముక్తి రాష్ట్రపతి పాలన ద్వారానే సాధ్యం.

Anonymous said...

Good Work. Good satire. Well said. Good article.

newsforu said...

ఇప్పటికే జనానికి రాజకీయాలంటే విముఖత ఎప్పుడో వచ్చేసింది. రొచ్చుకుంట అని అర్థమైంది.అందులోకి దిగడమంటే మూసీలో స్నానం చేసినట్లే. గురువారం నాడు అసెంబ్లీలో మన నేతలు ప్రవర్తించిన తీరు సిగ్గుసిగ్గు. ఇలాంటి చర్యలతో తమ పరువును తామే మరోసారి తీసుకున్నారు వీళ్లు. అయినా సిగ్గుపడాల్సింది వాళ్లుకాదు. మనం. ఇలాంటి వారిని అసెంబ్లీకి పంపించిన మనం సిగ్గుపడాలి. మనమే సిగ్గుపడాలి. మన చెప్పుతో మనం కొట్టుకోవాలి. కాదంటారా... ఇప్పటికైనా మనం మారదాం. కనీసం ఇలాంటి రాజకీయ గూండాల్ని తరిమికొడదాం. లేకుంటే భవిష్యత్ తరాలకు మనమే ద్రోహం చేసిన వాళ్లమవుతాం.

sudheerreddy said...

హాయ్ రాజు చాలా బాగా రాశావ్! సిగ్గులేకుండా జనం ఓట్లేస్తుంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యాక వారిని ఏం చెయ్యమంటావ్ చెప్పుమరి!

సుధీర్ రెడ్డి