Saturday, November 20, 2010

మతిలేని ప్రభుత్వం

ఎస్సై పరీక్ష వాయిదా వేసి ప్రభుత్వం తన చేతగాని తనాన్ని మరోసారి నిరూపించుకుంది. ఫ్రీజోన్ అంశం తేలేవరకూ ఎస్సై పరీక్ష వాయిదా వేయాలంటూ తెలంగాణా వ్యాప్తంగా నిరసనలు తలెత్తాయి. ఉస్మానియా యూనివర్సిటీ భగ్గుమంది. వీధుల్లోకి వచ్చిన విద్యార్థులు నానా హంగామా చేశారు. పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన ప్రభుత్వం.. వెంటనే ఎస్సై పరీక్షను అన్నిచోట్లా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 24 గంటల్లోనే నిర్ణయం మార్చుకుంది.

భగ్గుమన్న సీమాంధ్ర
     ఎస్సై పరీక్షను వాయిదా వేస్తున్నట్లు హోంమంత్రి అలా ప్రకటించారో లేదో అప్పుడే సీమాంధ్రలో నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. తెలంగాణ విద్యార్థుల ఒత్తిడికి తలొగ్గి.. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని సీమాంధ్ర విద్యార్థులు ఆరోపించారు. ప్రభుత్వాన్ని నడిపేది పాలకులా.. లేక తెలంగాణ విద్యార్థులా అని ప్రశ్నించారు.. వీధుల్లోకి వచ్చి నానా హంగామా చేసేసరికి.. ప్రభుత్వం వెనుకంజ వేసి పరీక్ష వాయిదా వేసిందని.. ఇప్పుడు తాము కూడా వీధుల్లోకి వచ్చాం కాబట్టి పరీక్ష జరపాలని డిమాండ్ చేస్తున్నారు..

చేతకాని ప్రభుత్వం
     ప్రస్తుతం రాష్ట్రంలో మళ్లీ గతేడాది డిసెంబర్ నాటి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ భగ్గుమంటుంటే.. సీమాంధ్ర శాంతంగా ఉంటోంది. అదే తెలంగాణ ప్రశాంతంగా ఉంటే సీమాంధ్రలో పరిస్థితి విరుద్ధంగా ఉంటోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఇరుప్రాంతాలను ప్రభావితం చేస్తాయని తెలుసు. కానీ ప్రభుత్వం మాత్రం ఇవేవీ ఆలోచించినట్లు లేదు.. ఎస్సై పరీక్ష వాయిదా వేసే ముందు.. సీమాంధ్రలో నిరసన జ్వాలలు వస్తాయని ప్రభుత్వం ఎందుకు గ్రహించలేదు.? తెలంగాణ విద్యార్థుల ఆందోళనలకు తలొగ్గి.. పరీక్ష వాయిదే వేస్తే.. సీమాంధ్ర విద్యార్థులు ఊరుకుంటారని ప్రభుత్వ పెద్దలు తప్పుడు అంచనా వేశారు. దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు.
      ప్రభుత్వం నిర్ణయం తీసుకునేముందు.. ఇరు ప్రాంత విద్యార్థులతో చర్చించి సామరస్యపూరక వాతావరణం కల్పించి ఉంటే బాగుండేది. పరిస్థితిని ఇరుప్రాంతాలవారికి వివరిస్తే.. వాళ్లు తప్పకుండా అర్థం చేసుకుంటారు. అలా చేయకుండా.. ప్రభుత్వం తన ఇష్టానుసారం వ్యవహరించింది. తన చేతగానితనాన్ని మరోసారి నిరూపించుకుంది..

7 comments:

newsforu said...

నిజం చెప్పారు బాస్.... ఇది చేతగాని చవట ప్రభుత్వమే... పాలిస్తున్నది రోశయ్యే కానీ ఆజ్ఞలు జారీ చేస్తున్నది తెలంగాణ జేఏసీ.
చేతకాని చవట మన ముఖ్యమంత్రి అని మనం చెప్పుకోవడానికి సిగ్గు పడకూడదేమో... 24 గంటల్లోనే సీఎం తన మాట మార్చుకున్నారు.
ఓ వైపు ఇంత రగడ జరుగుతుంటే 125 సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఏం పీకారనో....

Unknown said...

టెంప్లేట్ చాలా బాగుంది. రోజుకో ఐటెం అయినా పెట్టండి.

C L N RAJU said...

సత్యం గారూ.. తప్పకుండా రోజుకో పోస్ట్ చేసేందుకు ట్రై చేస్తాను.. కామెంట్ రాసినందుకు ధన్యవాదములు

ఎం. నాగరాజు said...

hai raju garu i feel extremely happy to see your blog and its title also very catchy. Yes i strongly agree with your comment on our feelings as a journalists its our primary right to speak what we think and believe. But at this un healthy competetive world we cant express aparently. Any way all the best and I hope we will see many more nice discussions on your blog....

C L N RAJU said...

Thank u soo much Nag..:-)

Thirmal Reddy said...

రాజు, నీ అభిప్రాయం తో విభేదిస్తున్నా కాని బ్లాగులోకాన్ని ఎంచుకోవడం సంతోషం. వెల్కం తో బ్లాగ్గర్

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

C L N RAJU said...

తిరుమలన్నా..అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదములు..