Saturday, December 11, 2010

ఆటోవాడి మోసాలు - పార్ట్ 2

     హైదరాబాద్ లో ఆటోవాళ్ల మోసాలు అన్నీ ఇన్నీ కావు. ఓసారి మా ఫ్రెండ్ దిల్'సుఖ్ నగర్ నుంచి లక్డీకపూల్ వెళ్లాలి. సరే అనే రోడ్డుపైన నిల్చుంది. ఒకటి రెండు ఆటోలు ఆపితే.. వాళ్లు ఆగకుండా వెళ్లిపోయారు. చివరకు ఒకడు  ఆపాడు. తను అడగ్గానే లక్డీకపూల్ వచ్చేందుకు సరేనన్నాడు. సరే అని ఎక్కి కూర్చుంది. మీటర్ చూస్తే.. అప్పటికే అది ఆన్'లో ఉంది. మీటర్ మళ్లీ ఆన్ చేయండి అని వెంటనే అడిగింది. అతడు ఓసారి మీటర్ వైపు చూసి.. మేడమ్ ఇప్పడు మీటర్ 40 రూపాయలు అయింది. మీరు దిగేటప్పుడు ఈ 40 రూపాయలు మైనస్ చేసి ఇవ్వండి అన్నాడు. కొంచెం తటపటాయిస్తూనే మా ఫ్రెండ్ సరేనంది. లక్డీకపూల్ వెళ్లేసరికి మీటర్ 120 రూపాయలు దాటింది. దిగేటప్పుడు వంద రూపాయల నోటు ఇచ్చింది. 120లో 40 రూపాయలు తీసేస్తే 80 రూపాయలు అవుతుంది.. మిగిలిన 20 రూపాయలు ఇవ్వు.. అని అంది..

     కానీ.. ఆటోవాడు రివర్స్ అయ్యాడు. మీటర్ 120 రూపాయలు అయింది. మీరే ఇంకా 20 రూపాయలు ఇవ్వాలి అన్నాడు. మా ఫ్రెండ్ ఖంగుతింది. అదేంటి.. నువ్వే కదా 40 రూపాయలు పట్టుకుని మిగిలింది ఇవ్వు అన్నావ్ అని గట్టిగా అడిగింది. ఎంతసేపు వాదించినా.. ఎంతగట్టిగా గద్దించినా ఉపయోగం లేకపోయింది. చుట్టుపక్కల అందరూ ఆటోవాళ్లే..! వాళ్లు కూడా ఆటోవాడికి సపోర్ట్'గానే మాట్లాడారు. మీటర్ ఎంతయిందో అంతా ఇచ్చేయండి మేడమ్ అన్నారు. తను స్టోరీ అంతా చెప్పినా కూడా సదరు ఆటోవాలాలు నమ్మలేదు. దీంతో.. చేసేదేం లేక.. 20 రూపాయలు సమర్పించుకుని.. తిట్టుకుంటూ ఆఫీస్'కు వెళ్లింది..

     చూశారుగా..! ఇది ఇంకో రకం ఆటోవాడి మోసం.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మన జేబు ఎలా ఖాళీ చేయాలో హైదరాబాద్ ఆటోవాలాలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో..! బీ కేర్'ఫుల్ ఫ్రెండ్స్..!!!

2 comments:

Charan said...

మీ ఫ్రెండ్ తెలివి తక్కువగా బిహేవ్ చేసింది కాక ? అంత గుడ్డిగా ఎలా వెళ్ళింది..

C L N RAJU said...

చరణ్ గారూ.. మా ఫ్రెండ్ తెలివి తక్కువదని గ్రహించే ఆటోవాడు ఈజీగా మోసం చేశాడు. నిజంగానే ఆ అమ్మాయి కొంచెం అమాయకురాలే లెండి..!!