ఎదుటివాళ్ల మీద అనవసరంగా రెచ్చిపోతున్నారా..?
తోటివాళ్లతో దురుసుగా మాట్లాడుతున్నారా..?
ఇంట్లోవాళ్లతో ప్రతి చిన్నవిషయానికి విసుక్కుంటున్నారా..?
అయితే... నేనిప్పుడు మీకో శుభవార్త చెబుతున్నా..!
ఎంతటి శుభవార్త అంటే.. నోట్లో చక్కెర పోసినంత తీయని వార్త..!!
తన కోపమే తన శతృవు అనేది సామెత.. మన నిత్య జీవితంలో ప్రతి మనిషికి ఎదురవుతున్న అనుభవమే..! ప్రతి పనికీ మానవ సంబంధాలే ముఖ్యమైన ఈ రోజుల్లో చీటికిమాటికి వచ్చే ఉద్రేకం లేదా కోపం వల్ల అన్నీ అనర్థాలే..! మరి ఇలాంటి ఇలాంటి అనర్థాలను ఒక స్పూను చక్కెర నియంత్రిస్తుందంటే నమ్ముతారా..? అవును.. ఇది నిజం..!
అమెరికాలోని ఒహియో యూనివర్సిటీ పరిశోధనల్లో ఈ విషయం తేలింది. మన ఉద్రేకానికి.. మెదడుకు శక్తిని అందించే గ్లూకోజే కారణమని వీరి అధ్యయనంలో తేలింది. మరి ఉద్రేకం కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి..? ఇందుకు మనో నిగ్రహం కావాలి..! నిగ్రహం కావాలంటే శరీరానికి చాలా శక్తి అవసరం.. ఈ శక్తిని గ్లూకోజ్ మెదడుకు అందిస్తుంది.. ఈ గ్లోకోజ్ మెదడుకు అందితే ఉద్రేకం ఠక్కున మాయమవుతుంది. ఇదీ సంగతి..!!

సో.. ఫ్రెండ్స్.. ఉద్రేకం తగ్గించుకోవడం సులభమే కదూ.. మరెందుకు ఆలస్యం..? ఉద్రేకం కలిగినప్పుడు ఓ స్పూను చక్కెర నోట్లో వేసుకోండి..!! అంతే.. u will be cool.. cool...!!
1 comment:
good idea...
Post a Comment