పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొంటున్నారా..?
మస్త్'గా సెక్స్ ఎంజాయ్ చేస్తున్నారా..?
అయితే.. మీ బంధం మూణ్ణాళ్ల ముచ్చటే..!!
"ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. కానీ లైఫ్'లో హ్యాపీనెస్ కనిపించడం లేదు.. పెళ్లికి ముందు చాలా బాగా ఉన్నాం.. కానీ మ్యారేజ్ అయిన మరుక్షణం నుంచే ఉత్సాహం తగ్గిపోయింది..".. ఇదీ పెళ్లి పక్షులుగా మారిన ప్రేమ పక్షుల అంతరంగం. ఎందుకీ పరిస్థితి..? ఎక్కడ పొరపాటు జరిగింది..? పెళ్లికి ముందు గాలి కూడా దూరనంతగా దగ్గరైన తాము.. పెళ్లి అయ్యాక ఎందుకింత గ్యాప్ వచ్చింది..?
ప్రేమించుకున్నాం.. రేపోమాపో మ్యారేజ్ చేసుకోబోతున్నాం.. శృంగారంలో పాల్గొంటే తప్పేంటని నిష్ఠూరంగా మాట్లాడకండి.. ఎందుకంటే మ్యారేజ్ బిఫోర్ సెక్స్'కు... మ్యారేజ్ తర్వాత శృంగారానికి చాలా తేడా ఉందని చెబుతున్నాయి- అమెరికన్ అధ్యయనాలు..! ఒకరినొకరు ఇలా ఇష్టపడి.. అలా బెడ్ ఎక్కితే.. ఇక భవిష్యత్తులో మ్యారేజ్ లైఫ్ సరిగా సాగదంటూ జంటల సాక్షిగా సెలవిస్తున్నాయివి.

శరీరాలే తప్ప మనసులు కలవకపోవడంతో.. పెళ్లి పెటాకులవుతోందని 2వేలకు పైగా మ్యారేజ్ అయిన వ్యక్తుల అధ్యయనంలో తేలింది. (శారీరకంగా కలిసినవారందరూ మానసికంగా కలిశారని చెప్పలేం.. కానీ మానసికంగా ఒక్కటైనవారు శారీరకంగా కలవడం సులభం).
ప్రేమ ప్రేమ.. అంటూ ప్రేమ పక్షుల్లా తిరగండి.. ఒకరినొకరు అర్థం చేసుకోండి.. అర్థం కాకుంటే వదిలెయ్యండి. అంతేకానీ.. త్వరగా కమిటవ్వకండి.. కమిటైతే.. ఇక అంతే..! ఆ తర్వాత బాధపడక తప్పదు..!!
3 comments:
నిజమే. పెళ్ళికి కావాల్సింది శారీరక కలయిక కాదు. మానసిక కలయిక. మనస్సులు కలవలేకపోతే శరీరాలు ఎంతో కాలం కలిసివుండలేవు. అందుకే పెళ్ళి చేసుకునే వ్యక్తుల్లో జాతకాలు, కులాలు, డబ్బు, హోదా ఇతరాలు కలుస్తున్నాయా అనేది ఎక్కువగా చూడకుండా మానసికంగా వాళ్ళిద్దరు ఎంతమేరకు కలుస్తున్నారో నిజాయితీగా చూసుకోవాలి. పెళ్ళికి ముందు ఆకర్షణలో, ప్రేమలో అన్ని లోటుపాట్లు మరుగుపడిపోయే ప్రమాదం వుంది కాబట్టి ఆ విషయమై జాగ్రత్త వహించాలి.
మంచి కామెంట్.. రాసినందుకు ధన్యవాదములు శరత్ గారూ..!!
please watch
http://bookofstaterecords.com/
for the greatness of telugu people.
Post a Comment