Saturday, December 18, 2010

నెట్'వర్కింగ్ సైట్స్'తో తలనొప్పులు..!!

ఫేస్'బుక్'లో మెంబర్ కావాలి...

ఆర్కుట్'లో ప్రొఫైల్ అప్'డేట్ చేయాలి..

ట్విట్టర్'లో ట్వీట్ పెట్టాలి...

ఇంతేనా...?

     ఇంటర్నెట్ ద్వారా పాత ఫ్రెండ్స్ అందరినీ ఒకే ప్లాట్'ఫాంపైకి తీసుకురావాలి... అందరితో కాంటాక్ట్'లో ఉండాలి.. ప్రతి ఒక్కరికి మెసేజ్ చేయాలి.. ప్రపంచంలో ముక్కూ ముఖం తెలియని వారితో ఫ్రెండ్'షిప్ చేయాలి.. భూమ్మీద జరిగే ప్రతి గొడవపైనా మన అభిప్రాయం పంచుకోవాలి.. ఇలా ఒకసారి ఇంటర్నెట్'కు అలవాటు పడిన తర్వాత క్రమంగా చేసే పనులివే.. బాగుందనో.. ఫ్రెండ్ లింక్ పంపాడనో.. లేదా నిజంగా అవసరమని భావించో.. ఎంతో మంది సోషల్ నెట్'వర్కింగ్ సైట్స్'లో మెంబర్స్ అవుతుంటారు.

     కానీ సోషలైజేషన్ ఆరాటం.. నెటిజెన్స్'లో ఒత్తిడికి కారణమవుతోందని ఓ తాజా సర్వే తేల్చింది. ఫేస్'బుక్'లో వివరాలు త్వరగా అప్'డేట్ చేయాలని.. మెసేజ్'లకు చాలా ఫాస్ట్'గా రిప్లై ఇవ్వాలనే ఆతృతే ఇందుకు కారణం.. ఇది క్రమంగా స్ట్రెస్'కు దారితీస్తోందని ఆస్ట్రేలియాలో జరిగిన ఓ సర్వేలో తేలింది. ఈ బాధ పురుషుల కంటే మహిళల్లోనే మరింత ఎక్కువట..!!

     సర్వేలో పాల్గొన్నవారిలో 69 శాతం మంది ఆస్ట్రేలియా మహిళలు.. తాము ఫేస్'బుక్ డీటెయిల్స్ అప్'డేట్ చేయడంలో ఒత్తిడికి గురవుతున్నామని చెప్పారు. 39 శాతం పురుషులదీ ఇదే బాధ.. ఇక తమ స్ట్రెస్'కు సోషల్ సైట్సే కారణమని 63 శాతం మంది చెప్పారు. అలాగే ఎప్పటికప్పుడు కాంటాక్ట్'లో ఉండాల్సిన కంపల్సరీ పరిస్థితిలో ఉన్నామని 33 శాతం మంది తెలిపారు. ఎప్పటికప్పుడు మెసేజ్'లు చెక్ చేసుకోకపోతే ఏదో వెనకబడిపోయిన ఫీలింగ్ కలుగుతోందని చెప్పినవారు కూడా ఉన్నారు. అంతేకాదు.. ఎంట్రీలు గొప్పగా, క్రియేటివ్'గా ఉండాలని జుట్టు పీక్కుని టైంవేస్ట్ చేయడం.. ఇది మళ్లీ ఒత్తిడికి దారితీయటం కూడా కామన్'గా మారిపోయిందట..!

     అంతే మరి..! అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. ఏదో సరదాగా అందరితో కాంటాక్ట్'లో ఉండేందుకు సోషల్ నెట్'వర్క్ సైట్లు వాడుకుంటే ఫరవాలేదు కానీ అదే లోకమైతే తలనొప్పులు తప్పవ్..!!!

5 comments:

Admin said...

baga rasaru.

C L N RAJU said...

Thank u Lakshmi gaaru... keep watching and give me ur valuable suggestions and comments..

కొత్త పాళీ said...

True. That's why never joined Orkut and twitter and disabled my Facebook profile.

Apparao said...

నెట్ వర్కింగ్ సైట్ లతో ఏమో గానీ , మనోళ్ళు ( తెలుగు బ్లాగర్ లు) బ్లాగ్ ల వల్ల ఇబ్బంది పడుతున్నారు
భావ వ్యక్తీకరణకి ఆటంకం కలిగిస్తున్నారు
ఏమాటంటే ఏమి అంటారో అని చాలా మంది భయపడుతున్నారు

శరత్ కాలమ్ said...

నేను కూడా అలా అనిపించినందువలననే సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఎప్పుడో తప్ప వాడను. బ్లాగులు కూడా భారం కాకుండా అందరం చూసుకోవాలి.