Saturday, December 04, 2010

ఆటో ఎక్కుతున్నారా..? ఓసారి ఆలోచించండి..!!

     హైదరాబాద్ లో ఆటో ఎక్కాలంటేనే భయమేస్తోంది. ఇదేంటి.. ఆటో ఎక్కడానికి ఆడవాళ్లు భయపడాలికానీ.. మగవాడివై ఉండి నీకెందుకు భయం అనుకుంటున్నారా..? కానీ నా అనుభవం వింటే మీరు కూడా ఆటో ఎక్కాలంటే ఓసారి తప్పకుండా ఆలోచిస్తారు..

     సుమారు ఆరేడు నెలల క్రితం సంఘటన ఇది. మార్నింగ్ షిఫ్ట్ డ్యూటీ కాగానే ఆఫీస్ నుంచి బయటకు వచ్చా.. (మా ఆఫీస్ ఖైరతాబాద్ లో ఉంది.) అక్కడి నుంచి హిమాయత్ నగర్ లో ఉంటున్న మా ఫ్రెండ్ ను కలిసేందుకు బయలుదేరా.! ఖైరతాబాద్ లో రోడ్డు దాటి ఆటోస్టాండ్ దగ్గరికి వెళ్లా.. హిమాయత్ నగర్ కు వస్తావా అని అడిగా.. వాడు అడ్డంగా తలూపి వెళ్లిపోయాడు. ఇంకొకడి దగ్గరికి వెళ్లా.. వాడు హిమాయత్ నగర్ అనగానే Sixty rupees అని ఠక్కున అనేశాడు. నేను మీటర్ లేదా అని అడిగా..! ఉంది సార్ అన్నాడు. మరి మీటర్ రేటు ఇస్తాను.. ఇష్టముంటే రా.. లేకుంటే వద్దు అని చెప్పాను. వాడు కాసేపు ఊ....ఆ.. అని సరేనన్నాడు.. ఆటో ఎక్కగానే మీటర్ వేశాడు.
  
     కాసేపట్లోనే ఆటో హిమాయత్ నగర్ చేరుకుంది. మీటరు 36 రూపాయలు అయింది. సరే.. 40 రూపాయలు తీసుకో అంటూ.. ఆటో దిగుతుండగానే hundred rupees change ఉందా... అని అడిగా.. ఉంది సార్.. అన్నాడు. సరే అని పర్స్ లో నుంచి hundred rupees తీసి ఇచ్చా.. నేను పర్సు వైపు చూస్తూ.. దాన్ని మడిచి ప్యాంటు జేబులో పెట్టుకున్నా..
సరే ఛేంజ్ ఇస్తాడు కదా అని వెయిట్ చేస్తున్నా... కానీ వాడు రివర్స్ లో నాకు షాక్ ఇచ్చాడు.. సర్.. పైసా దే.. అని ఉర్దూలో అన్నాడు.. అదేంటి.. hundred rupees ఇచ్చాను కదా.. అన్నాను.. నై సర్.. పైసా దే... అన్నాడు..
  
     ఒక్కసారిగా నాకు దిమ్మ తిరిగిపోయింది. ఇదేంటి ఇప్పుడే కదా hundred rupees తీసి ఇచ్చాను.. అనుకున్నా..! నాకు వెంటనే అర్థమయింది.. వీడు నన్ను మోసం చేస్తున్నాడని... వెంటనే నేను కూడా రివర్స్  అయ్యా... ఏంటి తమాషా చేస్తున్నావా...? పద పోలీస్ స్టేషన్ కి... అంటూ.. కాస్త ఫోర్స్ గా వాడిపైకి వెళ్లా... అంతలో వాడికి రైట్ సైడ్ కాలి దగ్గర hudred rupees note కనిపించింది.. తీ.. అక్కడ కనిపిస్తున్న hundred rupees తీ.. అన్నాను.. ఇదేంటి.. తమాషా చేస్తున్నావా... అని ఆ hundred rupees తీసుకున్నా..

     అప్పటికే చాలా మంది మా వాగ్వాదం చూసి అక్కడ గుమికూడారు.. వాళ్లలో ఒకాయన hundred rupees కి ఛేంజ్ ఇచ్చారు.. మీటర్ రేటు 36 రూపాయలు మాత్రమే వాడికిచ్చా..! అంతసేపూ తెలుగులో మాట్లాడుతూ వచ్చిన ఆటోవాడు.. ఒక్కసారిగా తెలుగు రానట్లు నటించాడు.. ఉర్దూ తప్ప ఒక్క తెలుగు ముక్క కూడా మాట్లాడలేదు.. నాతోపాటు అక్కడున్నవారంతా ఆటోవాణ్ని నానా మాటలు అన్నారు.. ఇదీ నా స్వానుభవం.. అప్పటి నుంచి అటో ఎక్కుతున్న ప్రతిసారి ఈ సంఘటన మదిలో మెదలుతుంది..

     నాలాంటివాళ్లెందరికో హైదరాబాద్ లో ఇలాంటి సంఘటనలు ఎదురయి ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఆటోవాడి ముందు అమాయకుడిగా కనిపించినా.. వాళ్లు నిట్టనిలువునా ముంచేయడం ఖాయం.. కానీ అందరు ఆటోవాళ్లు ఇలాంటి వాళ్లే అని నేను చెప్పడం లేదు.. అక్కడక్కడా మంచివాళ్లు కూడా ఉంటారు. ఇబ్బందల్లా.. ఇలాంటి జాదూగాళ్లవల్లే.. !  సో.. ఫ్రెండ్స్... ఆటో ఎక్కేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి.. ఎక్కేముందే.. సరిపడా చిల్లర జేబులో ఉంచుకుంటే మంచింది.. డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా వేరే వ్యాపకాలు లేకుండా వాడివైపు చూస్తూనే ఉండండి...! నా అనుభవం మీకు ఎదురు కాకూడదని ఆశిస్తున్నాను...

(ఆటోవాడి మోసాల్లో మరొక టైపును తర్వాతి పోస్టులో చూడండి..)
(మీకు కూడా ఇలాంటి సంఘటనలు ఎదురై ఉండొచ్చు. మీకిష్టమైతే వాటిని షేర్ చేసుకోండి.. కొందరికైనా మేలు జరుగుతుంది..)

3 comments:

Ramakrishna said...

paadu lokam, paadu buddi.

నరేష్ నందం (Naresh Nandam) said...

నావి కూడా ఇవే తిప్పలు..
నేనుండేది శ్రీనగర్ కాలనీ.. ఆఫీసుండేది రోడ్ నెం.11, బంజారా హిల్స్. కానీ కనీసం ఏడెనిమిది ఆటోవాలాలతో నో చెప్పించుకున్న తర్వాత కానీ ఆటో దొరకదు. ఎందుకంటే.. రూమ్ నుంచి ఆఫీస్ వరకూ ఆటో చార్జ్.. కరెక్టుగా 26 రూపాయలు అవుతుంది. వెళ్లటానికి ఉంది ఒకే రూట్. ఆటోవాడు అటు ఇటు తిప్పి మాయ చేయటానికి కుదరదు.

సో.. చివరికి నా మీద దయ తలిచి ఒకరు ఎక్కించుకుంటారు. అలా ఎక్కించుకున్న ఆటో మీటర్ 70% రాంగ్ రీడింగ్ చూపిస్తుంది. సో.. ఆఫీస్ ముందు ఆగగానే.. వాడితో గొడవ షురూ.. అసలే ఆపింది మీడియా ఆఫీస్ ముందు. గొడవెందుకులే అని వాడు ఊరుకుంటాడు. నేనిచ్చే 26రూపాయలు తీసుకుని వెళతాడు. ఇప్పటికి కనీసం పాతిక సార్లు వెళ్లి ఉంటా ఆటోలో ఆఫీసుకి. ఒక్కసారి కూడా అంతకు ముందు ఎక్కిన ఆటో ఎక్కలేదు.

చివరికి విసుగొచ్చి.. ఆటోవాలాల డిటెయిల్స్ ఉండే ప్లేట్, ఆటో డ్రైవర్, ఆటో నెంబర్ ఫోటోలు మొబైల్ కామ్‌తో తీయటం మొదలుపెట్టాను. ఇప్పటికి పది మంది డిటైల్స్ ఉన్నాయి నా దగ్గర. ఏమో.. ఆఫోటోలతో కుదిరితే ఆటోవాలాల మీటర్ మోసాలపై ఓ బ్లాగ్ మొదలు పెట్టేస్తానేమో త్వరలో.

angelgallela said...

this is really true.. it would be better to walk and go than to take an auto.... they never willing to put the meter...